రామోజీరావు మరణంపై రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. రాజేంద్రప్రసాద్ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు కొంతమంది నెటిజన్లు.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా..రాజకీయ సినీరంగ ప్రముఖులు.. ఆయన మరణం బాధాకరం అంటూ సోషల్ మీడియాలో తమ సందేశాలు ఉంచారు. ఇక ఆయన పార్థివ దేహాన్ని దర్శించిన అనంతరం పలువురు ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని బాధను వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ రామోజీ రావుగారి మరణం ఎంతో బాధాకరం.ఆయన భారతీయ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఒక దార్శనికుడు.ఆయన సేవలు సినీ,పత్రికారంగాలలో చెరగని ముద్ర వేశాయి. తన అవిరళ కృషి ద్వారా, ఆయన మీడియా, వినోద ప్రపంచాలలో శ్రేష్టమైన ఆవిష్కరణలకు నూతన ప్రమాణాలను నెలకొల్పారు.
— Narendra Modi (@narendramodi) June 8, 2024
రామోజీ రావు… pic.twitter.com/1cjAFSF6xB
అయితే రామోజీరావు మరణంపై సినీ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన్ని వేధించినవారి పతనం చూశాకే రామోజీరావు తుదిశ్వాస విడిచారని చెప్పారు రాజేంద్ర ప్రసాద్. నీఛ రాజకీయాల వల్ల ఆయన అనేక అవమానాలు అనుభవించారని అన్నారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. రాజేంద్రప్రసాద్ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు కొంతమంది నెటిజన్లు.
రామోజీరావు ఈ నీచ రాజకీయాల వల్ల అవమానాలు అనుభవించారు..
— (@TEAM_CBN1) June 8, 2024
ఆయనను వేధించిన వారి పతనం చూసి, ఆయన విజయం సాధించి వెళ్ళాడు#RamojiRao #RajendraPrasad pic.twitter.com/xcMJ4Qph1V
ఇక రామోజీ రావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రామోజీరావు అంత్య క్రియలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారని అంచనా.