పోలీసుల అదుపులో రాజాసింగ్, హనుమాన్ భక్తులు విధ్వంసం సృష్టిస్తారని రాజాసింగ్ హెచ్చరిక!
గతంలో మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు, ఏ మతాన్ని, వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశాలిచ్చింది. అయినా రాజాసింగ్ తన పద్దతి ఏ మాత్రం మార్చుకోలేదు.
హైకోర్టు మొట్టికాయలు వేసినా , ఆదేశాలిచ్చినా, పోలీసులు కేసులు పెట్టినా ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన పద్దతి మార్చుకోవడంలేదు. ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
గతంలో మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు, ఏ మతాన్ని, వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశాలిచ్చింది. అయినా రాజాసింగ్ తన పద్దతి ఏ మాత్రం మార్చుకోలేదు.
2023, జనవరి 29న ముంబైలో జరిగిన బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.మొన్న శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రాజాసింగ్ తన కొడుకుని పరిచయం చేస్తూ ఇతర కమ్యూనిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రసంగం పై పోలీసులు కేసు నమోదు చేశారు.
మళ్ళీ ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీలో పాల్గొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా పోలీసులు ఆయనను ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
తనను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ హనుమాన్ భక్తులు విధ్వంసం సృష్టిస్తే తనది బాధ్యత కాదని హెచ్చరించారు. తనను అరెస్టు చేస్తే తన అనుచరులు విధ్వంసం సృష్టిస్తారని ఆయన చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.