Telugu Global
Telangana

నేనే, నేనే.. మునుగోడు అభివృద్ధి ప్రదాత నేనే

తాను ఎవరికీ అమ్ముడు పోలేదు అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. గతం మరచిపోయిన గజినీలా మాట్లాడుతున్నారు. తాను పార్టీ మారినా తిరిగి కాంగ్రెస్‌ లోకే వచ్చానని చెప్పారు.

నేనే, నేనే.. మునుగోడు అభివృద్ధి ప్రదాత నేనే
X

నేనే, నేనే.. మునుగోడు అభివృద్ధి ప్రదాత నేనే

మునుగోడు నియోజకవర్గంలో గట్టుప్పల్ మండలంగా ఏర్పడింది.

చండూరు రెవెన్యూ డివిజన్ అయింది.

చౌటుప్పల్ లో వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు.

ఇదంతా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు మాజీ బీజేపీ, తాజా కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన రాజీనామా వల్లే ఉప ఎన్నికలొచ్చాయని, అందుకే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని గొప్పలు చెప్పుకున్నారు.

నేను అమ్ముడుపోయానా..?

ఈ ప్రశ్న అడుగుతోంది ఎవరో కాదు, రాజగోపాల్ రెడ్డే. ఆయన అమ్ముడుపోయారా లేదా అనేది కాంగ్రెస్ నేతలే వివరించి చెప్పారు. ఎన్ని కోట్లకు, ఏయే కాంట్రాక్ట్ లకు ఆయన అమ్ముడుపోయారనే విషయాన్ని ఆ పార్టీ వారే గత ఉప ఎన్నికల్లో వివరించారు. ఆ వ్యవహారాన్ని అందరూ మరచిపోయారనుకున్నారో ఏమో.. తాజాగా కాంగ్రెస్ లో చేరిన ఆయన గతం మరచిపోయిన గజినీలా మాట్లాడుతున్నారు. తాను పార్టీ మారినా తిరిగి కాంగ్రెస్‌ లోకే వచ్చానని చెప్పారు. మునుగోడు నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో కొట్లాడాను కానీ, ప్రజలు ఎక్కడ కూడా తలదించుకునేలా ప్రవర్తించలేదన్నారు.

తనను కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని, తానే పదవి త్యాగం చేశానని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. తాను పదవిలో ఉంటే అది ప్రజల కోసమేనన్నారు. తనకు ప్రజా బలం ఉందని, సొంత డబ్బుతో పేద ప్రజలకు సహాయం చేశానని చెప్పుకొచ్చారు. రాజగోపాల్ రెడ్డి అంటే ప్రాణమిచ్చే వాళ్లు లక్ష మంది ఉన్నారని గొప్పలు చెప్పుకున్నారు. ప్రాణమిచ్చేవారు సైతం, గత ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయలేదనే విషయాన్ని మాత్రం చెప్పలేకపోయారు రాజగోపాల్ రెడ్డి.

First Published:  5 Nov 2023 6:00 PM IST
Next Story