పోలీసుల విచారణకు హాజరైన రాజ్ పాకాల
జన్వాడ ఫామ్‌హౌస్ కేసుకు సంబంధించి లాయర్‌తోపాటు ఆయన విచారణకు వచ్చిన రాజ్ పాకాల
BY Raju Asari30 Oct 2024 12:58 PM IST

X
Raju Asari Updated On: 30 Oct 2024 1:00 PM IST
జన్వాడ ఫామ్‌హౌస్ కేసుకు సంబంధించిరాజ్ పాకాల మోకిల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. లాయర్‌తోపాటు ఆయన విచారణకు వచ్చారు. ఇటీవల పోలీసులు రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేశారు. పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉన్నదని అందులో పేర్కొన్నారు.నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతున్నది.
జన్వాడలోని ఫామ్ హౌస్‌పై ఇటీవల సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ కేసులో విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే రాజ్‌పాకాలకు నోటీసులు ఇచ్చారు.
Next Story