హైకోర్టును ఆశ్రయించిన రాజ్ పాకాల
పోలీసులు అక్రమంగా కేసులో ఇరికించడానికి యత్నిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్న రాజ్ పాకాల
BY Raju Asari28 Oct 2024 12:39 PM IST

X
Raju Asari Updated On: 28 Oct 2024 12:39 PM IST
జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారానికి సంబంధించి రాజ్ పాకాల తెలంగాణ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అక్రమంగా కేసులో ఇరికించడానికి యత్నిస్తున్నారని అందులో పేర్కొన్నారు. లంచ్ తర్వాత విచారిస్తామని జస్టిస్ విజయ్ సేన్‌రెడ్డి తెలిపారు. మరోవైపు రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫామ్‌హౌస్ పార్టీ కేసులో ప్రశ్నించాల్సి ఉన్నదని అందులో పేర్కొన్నారు. నేడు విచారణకు రావాలని చెప్పారు. విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో మోకిల ఇన్‌స్పెక్టర్ పేరుతో ఉన్న నోటీసులను రాయదుర్గంలోని ఓరియస్ విల్లాస్‌లో రాజ్‌పాకాల నివాసానికి అతికించారు.
Next Story