తెలంగాణలో ఐదు రోజులు వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
ఆయా జిల్లాల్లో సోమవారం నుంచి మే 4వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
BY Telugu Global30 April 2023 7:26 PM IST
X
Telugu Global Updated On: 30 April 2023 7:26 PM IST
కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు మరో ఐదురోజుల వరకు ఆగబోవని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల , భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఈ రాత్రి నుంచి రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అదే విధంగా ఆయా జిల్లాల్లో సోమవారం నుంచి మే 4వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
Next Story