Telugu Global
Telangana

రాహుల్‌కు అశోక్‌నగర్‌ యువత స్వాగతం పలుకుతోంది

ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అందించినందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు తెలపడానికి యువకులు ఎదురుచూస్తున్నారని కేటీఆర్‌ సెటైర్‌

రాహుల్‌కు అశోక్‌నగర్‌ యువత స్వాగతం పలుకుతోంది
X

అశోక్‌నగర్‌ యువత ఒక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అందించినందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు తెలపడానికి ఎదురుచూస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సెటైర్‌ వేశారు. ఈ మేరకు 'ఎక్స్‌'లో ఆయన పోస్ట్‌ చేశారు. రూ. 5 లక్షల యువ వికాసం సహాయం, పునరుద్ధరణకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. మీ హామీ పూర్తయినందున యవకులను కలవడానికి తిరిగి హైదరాబాద్‌కు స్వాగతం అంటూ ఎద్దేవా చేస్తూ పోస్ట్‌ పెట్టారు. గతంలో హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో పర్యటించిన సందర్భంగా రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదని కేటీఆర్‌ విమర్శించారు.

బీసీ బిడ్డలకు విదేశీ విద్య అందని ద్రాక్షేనా?

బీసీ బిడ్డలకు విదేశీ విద్య అందని ద్రాక్షేనా? అంటూ నిలదీస్తూ ఎక్స్‌ వేదికగా మరో పోస్ట్‌ పెట్టారు. 'నాడు కేసీఆర్‌తో సాధ్యం.. నేడు అసాధ్యం.. పేద విద్యార్థులతో సర్కార్‌ చెలగాటం. జ్యోతిబా ఫూలే విదేశీ విద్య పథకానికి కాంగ్రెస్‌ తూట్లు పొడుస్తున్నది. అధికారుల సాగతీతతో విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల కోర్సులు ముగుస్తున్నాయి. ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. దరఖాస్తు చేసుకొని ఏడాది అవుతున్నా ఎందుకింత నిర్లక్ష్యం? వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును రేవంత్‌ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టింది. తక్షణం జాబితా ప్రకటించిన ఉపకార వేతనం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం' అని కేటీఆర్‌ రాసుకొచ్చారు.

First Published:  9 Oct 2024 9:42 AM IST
Next Story