హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌ఫోర్టులో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు ఘన స్వాగతం పలికారు.
BY Vamshi Kotas5 Nov 2024 5:24 PM IST
X
Vamshi Kotas Updated On: 5 Nov 2024 5:24 PM IST
లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌ఫోర్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో బుధవారం నుంచి చేపట్టనున్న కులగణనపై మేధావులు,ప్రజలు, వివిధ సామాజిక వర్గాలతో రాహుల్ భేటీ కానున్న విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో జరగనున్న సమావేశంలో ఆయన పాల్గొంటారు. దాదాపు 200 మంది ప్రజాసంఘాలు, బీసీ సంఘాల నేతలు, మరో 200 మంది కాంగ్రెస్ నాయకులతో జరిగే సదస్సులో పాల్గొంటారు. వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. కులగణన ప్రాధాన్యతను ఆయన వివరించనున్నారు.
Next Story