Telugu Global
Telangana

రాహుల్ మేడిగడ్డ రిజర్వాయర్ సందర్శన ఉద్రిక్తం..

రాహుల్ మేడిగడ్డ సందర్శన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు బ్యారేజ్ వద్దకు దూసుకొచ్చాయి. బ్యారేజ్ పరిసరాల్లోకి ఎవరినీ పోలీసులు అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రాహుల్ మేడిగడ్డ రిజర్వాయర్ సందర్శన ఉద్రిక్తం..
X

రాహుల్ మేడిగడ్డ రిజర్వాయర్ సందర్శన ఉద్రిక్తం..

మేడిగడ్డ బ్యారేజీని రాహుల్ గాంధీ పరిశీలించారు. హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా బ్యారేజీని, కుంగిన పిల్లర్ ను ఆయన పరిశీలించారు. రాహుల్ మేడిగడ్డ సందర్శన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు బ్యారేజ్ వద్దకు దూసుకొచ్చాయి. బ్యారేజ్ పరిసరాల్లోకి ఎవరినీ పోలీసులు అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మేడిగడ్డకు వెళ్లే దారులన్నీ పోలీసులు మూసేశారు. బ్యారికేడ్లను తోసుకుంటూ కార్యకర్తలు దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

రాహుల్ తో పాటు హెలికాప్టర్లో రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి ఉన్నారు. బ్యారేజ్ పరిశీలనకు ముందు అంబటిపల్లిలో మహిళా సదస్సులో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని పాత పాటే పాడారు. నాసిరకంగా నిర్మాణం జరిగిందని ఆరోపించారు. ఆధునిక టెక్నాలజీ లేని రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల, నెట్టెంపాడు, బీమా తదితర ప్రాజెక్టు నేటికీ పటిష్టంగా ఉన్నాయన్నారు.


మేడిగడ్డపై విమర్శలు కాంగ్రెస్ కి కలిసొస్తాయా..?

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిన మాట వాస్తవమే అయినా.. నిర్మాణ సంస్థదే నిర్వహణ బాధ్యత కూడా కావడంతో ప్రజాధనం ఖర్చుకాకుండా, ప్రభుత్వ ఖజానాపై భారం లేకుండా మరమ్మతులు పూర్తవుతాయి. అయితే ఎన్నికల వేళ ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. కాళేశ్వరంపై విమర్శలు చేయడంతోపాటు, మేడిగడ్డ సందర్శనకు హెలికాప్టర్లో వచ్చి హడావిడి చేశారు రాహుల్ గాంధీ. కానీ ఈ ప్రచారం కాంగ్రెస్ కి రివర్స్ లో తగిలే ప్రమాదం ఉందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్ట్ ని కేసీఆర్ అతి తక్కువ సమయంలో పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించగలిగారనే విషయాన్ని పరోక్షంగా కాంగ్రెస్ హైలైట్ చేస్తుందని చెబుతున్నారు. ఈ ప్రచారం చివరికి బీఆర్ఎస్ కే మేలు చేస్తుందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.

First Published:  2 Nov 2023 5:59 AM GMT
Next Story