కరెంటు కోతలపై ప్రశ్నిస్తే కేసు.. కేటీఆర్ ఏమన్నారంటే!
ట్విట్టర్ వేదికగా విద్యుత్‌పై చర్చ జరుగుతున్న టైంలోనే అసలు ఎలాంటి ఫిర్యాదు లేకుండానే రాచకొండ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ అంశంపై పూర్తి వివరాలిస్తే తాము పరిశీలిస్తామంటూ రేవతికి ట్విట్టర్‌లో పర్సనల్ మెస్సేజ్ చేశారు.
తెలంగాణలో TGSPDCL అధికారులు, సిబ్బంది తీరు వివాదాస్పదంగా మారింది. కరెంటు కోతలపై ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేసినందుకు వినియోగదారులపై బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాదు పోలీసులు సైతం సామాజిక మాద్యమాల్లో కరెంటు కోతలపై పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ ఎల్బీనగర్‌లో జరిగింది.
Electricity Department Authorities @tgspdcl file case against Revathi, a journalist.
— Telugu Scribe (@TeluguScribe) June 19, 2024
Yesterday, a netizen had complained on X that electricity department officials had visited her home and threatened her to delete the tweet where she had complained of power cuts.
Journalist… https://t.co/7dnvomwzIt pic.twitter.com/zDgWMDhyfV
హైదరబాద్ ఎల్బీనగర్ పరిధిలోని ఆటోనగర్‌కు చెందిన కృతిక అనే మహిళ కరెంటు కోతలపై ట్వీట్ చేసింది. శనివారం రోజు ఏకంగా 7 గంటల పాటు కరెంటు పోయిందని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది.. కృతిక ఇంటికి వెళ్లి ట్విట్టర్‌లో పోస్టు డిలీట్ చేయాలని బెదిరించారు. ఈ విషయాన్ని మళ్లీ ట్వీట్ చేశారు కృతిక. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రేవతి అనే జర్నలిస్టు ఈ ఇష్యూపై స్పందించారు. కరెంటు కోతల గురించి ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగడాన్ని జర్నలిస్టు రేవతి తప్పుపట్టారు. ప్రశ్నించే హక్కు లేదనే రీతిలో విద్యుత్ శాఖ తీరు ఉందని మండిపడ్డారు.
ట్విట్టర్ వేదికగా విద్యుత్‌పై చర్చ జరుగుతున్న టైంలోనే అసలు ఎలాంటి ఫిర్యాదు లేకుండానే రాచకొండ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ అంశంపై పూర్తి వివరాలిస్తే తాము పరిశీలిస్తామంటూ రేవతికి ట్విట్టర్‌లో పర్సనల్ మెస్సేజ్ చేశారు. ఐతే ఇది విద్యుత్ శాఖకు సంబంధించిన అంశమని ఫిర్యాదు లేకుండా మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు రేవతి. ఐతే ఇవాళ జర్నలిస్టు రేవతిపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో రేవతిపై IPC సెక్షన్ 505, 66D, ITA ACT - 2008 కింద కేసు నమోదు చేశారు.
Shocking State of affairs in Telangana
— KTR (@KTRBRS) June 18, 2024
What right has the @TelanganaCOPs got to intrude and issue veiled threats to a journalist who raised a genuine concern about citizens plight with respect to Electricity ?
Is the police department running Energy department or is it just… https://t.co/PTRWrfehTO
ఈ ఇష్యూపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విద్యుత్ కోతలపై ప్రశ్నిస్తే పోలీసులు బెదిరింపులకు పాల్పడతారా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు షాకింగ్‌గా ఉన్నాయన్నారు. అసలు ఏ హక్కు ఉందని ఫిర్యాదుదారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. విద్యుత్ శాఖను పోలీసు శాఖ నడిపిస్తోందా అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.