Telugu Global
Andhra Pradesh

రాజ్యసభ నామినేషన్ దాఖలు చేసిన ఆర్ కృష్ణయ్య

ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీదా మస్తాన్‌ రావు, సానా సతీశ్‌, ఆర్‌.కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేశారు

రాజ్యసభ నామినేషన్ దాఖలు చేసిన ఆర్ కృష్ణయ్య
X

ఏపీలో ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకి బీజేపీ తరపున జాతీయ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, టీడీపీ తరపున బీద మస్తాన్ రావు, సాన సతీష్, నామినేషన్లు దాఖలు చేశారు. ఆర్ కృష్ణయ్య మెడలో కాషాయ కండువాతో పార్లమెంట్ ఆవరణలో కనిపించిన ఆయన.. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు.. తాను చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేస్తానని.. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనత పార్టీ తోనే సాధ్యమని చెప్పుకొచ్చారు. తాను బీసీల కోసం చేస్తున్న సేవలను గుర్తించి బీజేపీ తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించింది అని. తనకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని.. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య చెప్పుకొచ్చారు.

అలాగే తాను పార్టీలు మారడం లేదని.. తన వద్దకే పార్టీలు వస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మంగళవారమే చివరి రోజు. రాజ్యసభ సభ్యులుగా కృష్ణయ్య, మస్తాన్‌రావు, సతీష్‌ల ఎన్నిక లాంఛనమే. కేవలం ఒక రాజ్యసభ సభ్యుడిని ప్రతిపాదించేందుకు అవసరమైన సంఖ్యలో మాత్రమే ఎమ్మెల్యేలున్న వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. రాష్ట్రాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అభ్యర్థులు చెప్పారు. తమకు అవకాశం ఇచ్చినందుకు పార్టీలకు ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు

First Published:  10 Dec 2024 2:02 PM IST
Next Story