Telugu Global
Telangana

తెలంగాణ సాగునీటి రంగ‍ంలో సంస్కరణలపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ వచ్చిన పంజాబ్ సీఎం

ముందుగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో భాగమైన‌ కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఎర్రవెల్లి వద్ద నిర్మించిన చెక్-డ్యామ్‌లను సందర్శించి, అభివృద్ధి చేసిన కృత్రిమ రీఛార్జి నిర్మాణాలను పరిశీలిస్తారు.

తెలంగాణ సాగునీటి రంగ‍ంలో సంస్కరణలపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ వచ్చిన పంజాబ్ సీఎం
X

తెలంగాణలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన గురువారం సిద్దిపేట జిల్లాలో పర్యటించి గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో నీటిపారుదల, ఇతర శాఖల ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించ‌నున్నారు. సాగునీటి రంగం అభివృద్దిని ఆయనకు అర్దం చేయించడానికి ఆయనతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వెళ్ళనున్నారు.

ముందుగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో భాగమైన‌ కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఎర్రవెల్లి వద్ద నిర్మించిన చెక్-డ్యామ్‌లను సందర్శించి, అభివృద్ధి చేసిన కృత్రిమ రీఛార్జి నిర్మాణాలను పరిశీలిస్తారు.

ఆ తర్వాత‌ ముఖ్యమంత్రులిద్దరూ పాండవుల చెరువును సందర్శించి మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను అధ్యయనం చేయనున్నారు. స్థానిక రైతులతోనూ వారు సంభాషించనున్నారు.

First Published:  16 Feb 2023 2:21 AM GMT
Next Story