Telugu Global
Telangana

నల్గొండ టీచర్స్‌ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి గెలుపు

సిట్టింగ్‌ ఎమ్మెల్సీపై రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధించిన శ్రీపాల్‌ రెడ్డి

నల్గొండ టీచర్స్‌ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి గెలుపు
X

నల్గొండ - ఖమ్మం - వరంగల్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్‌టీయూ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌ రెడ్డి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. 17 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత అత్యధిక ఓట్లతో మొదటి స్థానంలో శ్రీపాల్‌ రెడ్డి నిలిచారు. రెండో స్థానంలో ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కన్నా శ్రీపాల్‌ రెడ్డికి 2,651 ఓట్లు అధికంగా పోల్‌ అయ్యాయి. శ్రీపాల్‌ రెడ్డికి 11,099 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. నర్సిరెడ్డి ఎలిమినేషన్‌ తర్వాత శ్రీపాల్‌ రెడ్డి 13,969 ఓట్లు సాధించాడు. గెలుపునకు అవసరమైన కోటా సాధించడంతో శ్రీపాల్‌ రెడ్డిని రిటర్నింగ్‌ అధికారి విజేతగా ప్రకటించారు.





First Published:  3 March 2025 10:20 PM IST
Next Story