బండి సంజయ్ కి వ్యతిరేకంగా నిరసనలు
కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆరెస్ నాయకులు మాట్లాడుతూ.. అమాయక విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీ నేతలను తప్పుబట్టారు. సంజయ్ కుమార్‌పై లోక్‌సభకు అనర్హత వేటు వేయాలని ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
SSC హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అని తేలడంతో భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పలు చోట్ల సంజయ్ దిష్టి బొమ్మలు దహనం చేయగా వరంగల్ లో బండి సంజయ్ కారుపై చెప్పులతో , కోడి గుడ్లతో దాడి చేశారు.
కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆరెస్ నాయకులు మాట్లాడుతూ.. అమాయక విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీ నేతలను తప్పుబట్టారు. సంజయ్ కుమార్‌పై లోక్‌సభకు అనర్హత వేటు వేయాలని ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
మరో వైపు బండి సంజయ్ ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చడానికి పోలీసులు తీసుకొచ్చినప్పుడు అక్కడ చేరిన వందలాది మంది బీఆరెస్ కార్యకర్తలు సంజయ్ కి, బీజేపీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండి సంజయ్ ఉన్న కారుపై చెప్పులతో, కోడి గుడ్లతో దాడికి దిగారు. ఆ కారుకు అడ్డుపడ్డారు. అదే సమయంలో అక్కడికి బీజేపీకార్యకర్తలు కూడా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. బండి సంజయ్ ని ప్రొడ్యూస్ చేసిన జడ్జి ఇంటి ముందు భారీగా పోలీసులుమోహరించారు.