బడేభాయ్, చోటే భాయ్ కామెంట్స్.. ప్రధాని మోడీ రియాక్షన్ ఇదే
దేశానికి నిజాయితీగా సేవ చేయడం తన నుంచి రేవంత్ రెడ్డి నేర్చుకుంటారన్నారు ప్రధాని. కానీ, తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వం కమీషన్లు తీసుకోవడంతో ఏమి మిగలడం లేదన్నారు.
బడే భాయ్, చోటా భాయ్ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో పాపులర్ అయ్యాయి. ప్రధాని మోడీని రేవంత్ బడే భాయ్ అంటూ సంబోధించడమే ఇందుకు కారణం. అయితే తాజాగా ఈ కామెంట్స్‌పై ప్రధాని మోడీ స్పందించారు. టీవీ-9 ఐదుగురు ఎడిటర్లతో నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడారు ప్రధాని మోడీ.
రేవంత్ రెడ్డికి నిజంగా తనపై బడే భాయ్ అనే భావన ఉంటే.. ప్రభుత్వాన్ని ఆయన నిజాయితీగా నడపగలుగుతారన్నారు మోడీ. దేశానికి నిజాయితీగా సేవ చేయడం తన నుంచి రేవంత్ రెడ్డి నేర్చుకుంటారన్నారు ప్రధాని. కానీ, తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వం కమీషన్లు తీసుకోవడంతో ఏమి మిగలడం లేదన్నారు. తెలంగాణను RR ట్యాక్స్ సర్వనాశనం చేస్తోందన్నారు.
అవినీతి విషయంలో మెడల్స్ ఇస్తే కాంగ్రెస్‌కు గోల్డ్ మెడల్, బీఆర్ఎస్‌కు సిల్వర్ మెడల్ ఖాయమన్నారు. అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయన్నారు. ఇక కేంద్రంలో సంకీర్ణ సర్కార్ రాబోతుందన్న ప్రచారాన్ని మోడీ కొట్టిపారేశారు.