Telugu Global
Telangana

భారత జట్టుకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టును రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు తెలిపారు

భారత జట్టుకు  రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
X

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టును అభినందిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నందుకు టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు. మూడుసార్లు ట్రోఫీని గెలుచుకున్న ఏకైక జట్టుగా టిమీండియా నిలిచింది. భారత క్రికెట్ చరిత్ర సృష్టించినందుకు ఆటగాళ్లు, యాజమాన్యం, సహాయక సిబ్బంది అత్యున్నత ప్రశంసలకు అర్హులు.

భారత క్రికెట్‌కు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు.‘అసాధారణమైన ఆట.. అసాధారణ ఫలితం!, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తీసుకువచ్చినందుకు మన క్రికెట్ జట్టు పట్ల గర్వంగా ఉంది. వారు టోర్నమెంట్‌ ఆసాంతం అద్భుతంగా ఆడారు. అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసినందుకు మా జట్టుకు అభినందనలు’. అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. దుబాయ్ ఇంటర్‌నేషనల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌ తో జరిగిన ఫైనల్‌లో మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను మట్టికరిపించింది.

First Published:  10 March 2025 9:49 AM IST
Next Story