రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా శుక్ర, శని వారాల్లో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడనున్నట్టు తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా శుక్ర, శని వారాల్లో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడనున్నట్టు తెలిపారు. సీటీవో జంక్షన్, పీఎన్టీ ఫ్లైఓవర్ జంక్షన్, బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అవుట్ గేట్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్ రోడ్, వీవీ విగ్రహం జంక్షన్, పంజగుట్ట జంక్షన్, ఎన్.ఎఫ్.సి.ఎల్ జంక్షన్లలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, అలాగే శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య ట్రాఫిక్ ఆంక్షలుంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
♦ సికింద్రాబాద్ నుంచి బేగంపేట్, రాజ్ భవన్ మీదుగా అమీర్ పేట్, మెహిదీ పట్నం వెళ్లాల్సిన బస్సులు ట్యాంక్ బండ్ మీదుగా వెళ్తాయి.
♦ మోనప్ప జంక్షన్ నుంచి రాజ్ భవన్ వైపు, ఖైరతాబాద్ నుంచి రాజ్ భవన్ రోడ్డుకు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ రోడ్డును మూసివేస్తారు.
♦ సీటీవో జంక్షన్, మినిస్టర్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను రసూల్ పుర జంక్షన్ లో కొద్దిసేపు నిలిపేస్తారు. అలాగే పంజగుట్ట, గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్ట్ వైపు వెళ్లే వాహనాలను ప్రకాశ్ నగర్ టీ జంక్షన్ దగ్గర కొద్దిసేపు నిలిపేస్తారు.
♦ కూకట్‌పల్లి, బాలానగర్ నుంచి ఫతేనగర్ బ్రిడ్జ్ మీదుగా బేగంపేట్ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్లే వాహనాలను బల్కంపేట ఎల్లమ్మ ఆలయం దగ్గర నుంచి అమీర్ పేట్ మైత్రీవనం, సత్యం థియేటర్ వైపునకు మళ్లించనున్నట్టు పోలీసులు తెలిపారు.