Telugu Global
Telangana

ప్రజాపాలన విజయోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలే

అధికారులకు సీఎస్‌ శాంతి కుమారి ఆదేశం

ప్రజాపాలన విజయోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలే
X

ఎల్‌బీ స్టేడియంలో ఈనెల 14న ప్రజాపాలన విజయోత్సవాల ప్రారంభ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని అధికారులను సీఎస్‌ శాంతి కుమారి ఆదేశించారు. సోమవారం సెక్రటేరియట్‌ లో ఈ ఉత్సవాలపై అన్ని శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జన్మదినం సందర్భంగా 14 వేల మంది పాఠశాల విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొనే ఈ కార్యక్రమంలో ఏడాది కాలంలో విద్యార్థుల కోసం ప్రభుత్వం చేసిన గణనీయమైన మార్పులు తెలియజెప్పేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డైట్‌ చార్జీల పెంపు, అన్ని స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌, స్కూళ్లకు ఉచిత కరెంట్‌ తదితర కార్యక్రమాలు వివరించేలా కార్యక్రమాలు ఉండలన్నారు. విద్యార్థులతో మోడల్‌ అసెంబ్లీ నిర్వహించాలన్నారు. అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని, వాళ్లు ఎండావానలకు ఇబ్బంది పడకుండా ఎల్‌బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 14 నుంచి డిసెంబర్‌ 9 వరకు 26 రోజుల పాటు ఈ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌ రాజ్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు శ్రీధర్‌, బుర్రా వెంకటేశం, సెక్రటరీ శరత్‌ తదితరులు పాల్గొన్నారు.

First Published:  11 Nov 2024 9:16 PM IST
Next Story