Telugu Global
Telangana

ప్రజా భవన్ లో నిధుల దుబారా..? వెల్లువెత్తిన విమర్శలు

ప్రజా భవన్ పేరుతో నిధుల దుర్వినియోగం జరుగుతుందనే ఆరోపణలు వినపడుతున్నాయి. టెండర్లకు సంబంధించిన కొన్ని పత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రజా భవన్ లో నిధుల దుబారా..? వెల్లువెత్తిన విమర్శలు
X

మరుగుదొడ్ల రిపేర్లకు, దోమతెరల కొనుగోలుకు రూ. 35 లక్షలు

గన్ మెన్ల రూములకోసం, జిమ్ రూమ్ లో అద్దాలకోసం రూ. 28.70 లక్షలు

స్వయానా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాసం ఉంటున్న ప్రజా భవన్ రిపేర్ల ఖర్చులివి. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ప్రగతి భవన్ పేరుని ప్రజా భవన్ గా మార్చారు. అక్కడ కొన్నిరోజులు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆ తర్వాత దాన్ని డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసంగా మార్చారు. పేరు మార్పు, నివాసం మార్పే కాదు.. అక్కడ ఉన్నవాటిని కూడా పూర్తిగా తనకు అనుగుణంగా మార్చుకుంటున్నారు భట్టి. అందులో భాగంగానే దోమతెరల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారట.



ఎందుకీ దుబారా..?

ప్రజా భవన్ మరమ్మతులకోసం పిలిచిన టెండర్లలోని కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేవలం మరుగుదొడ్ల మరమ్మతులకోసమే లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తేలడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజా ధనం దుబారా చేస్తున్నారని మండిపడుతున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించలేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని తప్పు అని కూడా వారు ఖండించకపోవడం విశేషం.

అప్పుడేం చెప్పారు..? ఇప్పుడేం చేస్తున్నారు..?

ప్రతిపక్షంలో ఉండగా.. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో దుబారా జరిగిందని ఆరోపించారు. తమ హయాంలో అలాంటి తప్పులు జరగవన్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రజా భవన్ పేరుతో నిధుల దుర్వినియోగం జరుగుతుందనే ఆరోపణలు వినపడుతున్నాయి. టెండర్లకు సంబంధించిన కొన్ని పత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనికి కాంగ్రెస్ నేతలు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.

First Published:  20 Jan 2024 3:40 PM IST
Next Story