Telugu Global
Telangana

పోస్ట్ కార్డ్ ఉద్యమం ...చేనేత సమస్యలపై మోడీకి కార్డు రాసిన కేటీఆర్

ప్రధాని నరేంద్ర‌ మోడీకి తెలంగాణ మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పోస్ట్ కార్డు రాశారు. చేనేత ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ఆయన ఆ కార్డులో డిమాండ్ చేశారు.ప్రజలు కూడా పెద్ద ఎత్తున పోస్ట్ కార్డులు రాయాలని కేటీఆర్ కోరారు.

పోస్ట్ కార్డ్ ఉద్యమం ...చేనేత సమస్యలపై మోడీకి కార్డు రాసిన కేటీఆర్
X

చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రధానిమోడీకి లక్షలాదిగా పోస్టు కార్డులు రాయాలని నిన్న పద్మశాలి సభలో పిలుపునిచ్చిన కేటీఆర్ ఈ రోజు తాను స్వయంగా పోస్టు కార్డు రాశారు. ప్రధానంగా చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

దేశ స్వాతంత్య్రం సంగ్రామంలో చేనేత ఉద్యమం జాతిని ఏకతాటిపై నిలిపిందని కేటీఆర్ గుర్తు చేశారు. అత్యంత కీలక ఉద్యమ సాధనంగా ఉపయోగపడ్డ‌ చేనేత వస్త్రాలపైన పన్ను వేసిన తొలి ప్రధాని మోడీనే అని కేటీఆర్ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో మండిపడ్డారు. ఒకవైపు మేకిన్ ఇండియా, , ఆత్మనిర్బర్ భారత్ నినాదాలు ఇస్తూ, గాంధీ మహాత్ముని సూత్రాలను వల్లే వేసే మోడీ సర్కార్ తన విధానాల్లో మాత్రం అందుకు పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అన్నారు. చేనేత రంగం దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోందని చెప్పిన కేటీఆర్ అటువంటి చేనేత పై వెంటనే పన్నును రద్దు చేయాలని కోరారు.

ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో ఒక్క చేనేత కార్మికులే కాకుండా వారి పట ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ ఒక్కో పోస్ట్ కార్డు ప్రధానికి రాయాలని కేటీఆర్ కోరారు.

First Published:  22 Oct 2022 2:28 PM GMT
Next Story