Jamuna: ప్రముఖ నటి జమున కన్నుమూత!
1936, ఆగస్టు 30న కర్నాటకలోని హంపిలో జన్మించిన జమున తన 16 ఏళ్ళ వయసులో 1953లో పుట్టిల్లు మూవీలో మొదటి సారి నటించారు. సత్యభామ పాత్రలో ఆమె నటన అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేరు.
సీనియర్ నటి జమున తన నివాసంలో ఈ రోజు తెల్లంవారుజామున తుది శ్వాస విడిచారు.ఆమెకు 86 ఏళ్ళు. జమున తెలుగు, తమిళ, కన్నడ, హిందీ మూవీల్లో నటించారు.మిస్సమ్మ సినిమా ఆమెకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది..
1936, ఆగస్టు 30న కర్నాటకలోని హంపిలో జన్మించిన జమున తన 16 ఏళ్ళ వయసులో 1953లో పుట్టిల్లు మూవీలో మొదటి సారి నటించారు. సత్యభామ పాత్రలో ఆమె నటన అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేరు.
ఆమె రాజకీయాల్లో కూడా ప్రవేశించారు. 1989లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆమె బీజేపీ లో చేరారు. అయితే అప్పటి నుండి ఆమె రాజకీయాలకు, సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు.
ఈ రోజు 11 గంటలకు జమున భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలిస్తారు.
జమున అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితర నటుల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించిందామె. శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో ఆమె సత్యభామ పాత్ర వేసింది.
తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది.
ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ చిత్రాలు రజతోత్సవం జరుపుకున్నాయి.