13 స్థానాలివ్వండి.. కాంగ్రెస్‌కు పొంగులేటి ప్రతిపాదన..!
తాను అడిగిన 13 స్థానాలు ఇస్తే గెలుపు బాధ్యత తానే తీసుకుంటానని అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన పొంగులేటి ఈ 13 స్థానాలను గెలిపించి గిఫ్ట్‌గా ఇస్తానని పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది.
అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ తర్జనభర్జన పడుతున్న వేళ.. అధిష్టానం ముందు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్త ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. తనతో పాటు తన అనుచరులకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకత్వాన్ని మొత్తం 13 స్థానాలు కోరినట్లు తెలుస్తోంది. ఈ 13 స్థానాల్లో గెలుపు బాధ్యత తాను తీసుకుంటానని అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం.
పొంగులేటి కోరిన స్థానాల్లో పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు నుంచి కోరం కనకయ్య, అశ్వారావుపేట నుంచి జారె ఆదినారాయణ, వైరాలో విజయాభాయ్, సత్తుపల్లిలో కొండూరు సుధాకర్‌లకు టికెట్ కోరినట్లు తెలుస్తోంది. ఇక తనకు ఖమ్మం, కొత్తగూడెం, పాలేరులో ఏదో ఒక నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. మహబూబబాద్‌లో మురళీ నాయక్, డోర్నకల్‌లో రాంచందర్ నాయక్, శేరిలింగంపల్లిలో రఘునాథ్ యాదవ్, చెన్నూరులో డాక్టర్ రాజా రమేష్, పాలకుర్తిలో ఝాన్సీరెడ్డి, కంటోన్మెంట్ నుంచి పిడమర్తి రవి, సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పొంగులేటి కాంగ్రెస్‌ను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
తాను అడిగిన 13 స్థానాలు ఇస్తే గెలుపు బాధ్యత తానే తీసుకుంటానని అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన పొంగులేటి ఈ 13 స్థానాలను గెలిపించి గిఫ్ట్‌గా ఇస్తానని పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పొంగులేటి ప్రతిపాదనపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.