సారు.. కారు.. మళ్లీ కేసీఆర్ సర్కారు.. తేల్చేసిన ప్రశాంత్‌కిశోర్
జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు తిరుగులేదని చెప్పారు. ఆయన పాలనే తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్‌కు పట్టం కడుతుందన్నారు.
ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే.. రాజకీయ వ్యూహకర్తగా దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆయన ఏ పార్టీకైనా పని చేసినా, ఏ పార్టీ అయినా అధికారంలోకి రాబోతుందని చెప్పినా.. అది అక్షరసత్యంగా మారుతుంది. అలాంటి పీకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించబోతోందని జోస్యం చెప్పారు. సారు, కారు.. గులాబీ సర్కారు తెలంగాణలో ముచ్చటగా మూడోసారి కొలువుదీరనుందని తేల్చేశారు.
కేసీఆర్‌కు తిరుగులేదు
సోమవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు తిరుగులేదని చెప్పారు. ఆయన పాలనే తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్‌కు పట్టం కడుతుందన్నారు. ఎన్నికల వ్యూహకర్తగా ఫలితాలను పక్కాగా అంచనా వేయగల పీకే.. ఈసారీ గెలుపు బీఆర్ఎస్‌దేనని చెప్పడం.. హ్యాట్రిక్ కొట్టి తీరతామంటున్న గులాబీ నేతలకు మంచి కిక్కు ఇస్తోంది.
బీజేపీకి ఆ ఒక్కటేనా..?
రాజస్థాన్‌లో కాంగ్రెస్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తాయని పీకే అన్నారు. మొత్తంగా చూస్తే పీకే రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో తప్ప ఎక్కడా కమల వికాసానికి అవకాశాల్లేవని ఆయన తేల్చిచెప్పారు. పీకే జోస్యమే నిజమైతే సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీకి ఇది షాకే.
*