ఇండిపెండెంట్‌గా ‘పొలిమేర’ నటి
‘సత్యం’ రాజేష్ కీలక పాత్రలో నటించిన ‘పొలిమేర’, ‘పొలిమేర 2’ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దాసరి సాహితి బుధవారం తన నామినేషన్‌ను అధికారులకు అందజేశారు.
ఇటీవల కాలంలో రాజకీయాలపై సినీ, క్రీడా రంగాల్లో ఉన్నవారు కూడా ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎన్నికల బరిలోనూ పోటీపడేందుకు సై అంటున్నారు. తాజాగా ‘పొలిమేర’ చిత్ర నటి అదే బాటలో నడిచారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు బుధవారం ఆమె తన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంక్‌కు సమర్పించారు.
‘సత్యం’ రాజేష్ కీలక పాత్రలో నటించిన ‘పొలిమేర’, ‘పొలిమేర 2’ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దాసరి సాహితి బుధవారం తన నామినేషన్‌ను అధికారులకు అందజేశారు. ‘పొలిమేర’ చిత్రం రెండు భాగాల్లో గెటప్ శ్రీను భార్య రాములు పాత్రలో, రాజేష్‌ను ప్రేమించిన యువతిగా నటించి మెప్పించడం గమనార్హం. రాజకీయాల గురించి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన సాహితి.. ఇన్‌స్టాలో తాను రీల్స్ చేసే పాటలకు పొలిటికల్ విషయాలను ఆపాదించొద్దని విజ్ఞప్తి చేశారు.