Telugu Global
Telangana

డ్రగ్స్‌ కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ కొడుకు.. తప్పించిన పోలీసులు.?

డ్రగ్స్ తీసుకున్న అనుమానితుల జాబితాలో డైరెక్టర్ క్రిష్ ఉన్నారని చెప్పారు డీసీపీ వినీత్‌. హోటల్ నిర్వాహకులపైనా కూడా కేసులు పెడతామన్నారు.

డ్రగ్స్‌ కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ కొడుకు.. తప్పించిన పోలీసులు.?
X

గచ్చిబౌలి రాడిసన్‌ డ్రగ్స్ కేసులో ఊహించని పేర్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి తనయుడు కూడా ఈ పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం చాకచాక్యంగా ఆయన ఈ కేసులో ఇరుక్కోకుండా అప్పటికప్పుడు బయటకు పంపించేశారని సమాచారం. ఆయన పేరు బయటకు రాకుండా.. ప్రభుత్వంలో కీలక స్థాయిలో ఉన్న వ్యక్తులు సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మీడియాలో ఎక్కడా ప్రచారం జరగకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

రాడిసన్‌ డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో ఇప్పటివరకూ 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరికి కొకైన్‌ విక్రయించిన అబ్బాస్‌ అలీపై కూడా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నిర్వహించిన దాడుల్లో మంజీరా గ్రూప్‌ డైరెక్టర్‌, బీజేపీ నేత యోగానంద్ కుమారుడు వివేకానందతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

డ్రగ్స్ తీసుకున్న అనుమానితుల జాబితాలో డైరెక్టర్ క్రిష్ ఉన్నారని చెప్పారు డీసీపీ వినీత్‌. హోటల్ నిర్వాహకులపైనా కూడా కేసులు పెడతామన్నారు. అబ్బాస్ పదిసార్లు డ్రగ్స్ తెచ్చాడని.. ఇన్నిసార్లు ఎక్కడి నుండి తెస్తున్నాడో విచారిస్తున్నామని చెప్పారు. సరఫరా చేసిన ప్రతిసారి 4 గ్రాముల కొకైన్ తెచ్చాడని తెలిసింది. అలానే డైరెక్టర్ క్రిష్‌ని విచారించి.. డ్రగ్ పరీక్షలు కూడా చేస్తామన్నారు. రక్త, మూత్ర పరీక్షలు చేస్తే అసలు నిజమేంటనేది తెలుస్తుందన్నారు డీసీపీ వినీత్‌.

First Published:  28 Feb 2024 8:43 AM IST
Next Story