Telugu Global
Telangana

ఫార్మ్ హౌజ్ కుట్ర‌ నిందితులకు పోలీసుల నోటీసులు - ఈ రోజు విచారణకు హాజరు కావాలని ఆదేశం

టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనడానికి కుట్ర చేసిన నిందితులు రామచంద్రభారతి,నందకుమార్, సింహయాజీలకు పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద ఆ ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు పోలీసు విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించారు.

ఫార్మ్ హౌజ్ కుట్ర‌ నిందితులకు పోలీసుల నోటీసులు - ఈ రోజు విచారణకు హాజరు కావాలని ఆదేశం
X

టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ తరపున ఫార్మ్ హౌజ్ కుట్ర కు తెగబడ్డ ముగ్గురు నిందితులు రామచంద్రభారతి,నందకుమార్, సింహయాజీల రిమాండ్ కు కోర్టు సా‍ంకేతిక కారణాల రీత్యా అంగీకరించకపోవడంతో పోలీసులు వాళ్ళను విడుదల చేశారు. అయితే కొద్ది సేపాటి క్రితం పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద ఆ ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు పోలీసు విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించారు.

అయితే ఆ ముగ్గురు పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనేది తెలియాల్సింది. ఆ ముగ్గురు రాత్రి నుంచి నంద కుమార్ ఇంట్లోనే ఉన్నారు. తాము ఆ ఫార్మ్ హౌజ్ కు పూజలకు మాత్రమే వెళ్ళామన్న వాదన వినిపిస్తున్నాడు నందకుమార్. ఎమ్మెల్యేల కొనుగోళ్ళ స్కాం గురించి తనకేమీ తెలియదన్నాడాయన.

కాగా టీఆరెస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్ష వర్ధన్ రెడ్డిల కు ఒక్కొక్కరికి వంద కోట్లు ఇస్తామని, కాంట్రాక్టులు ఇస్తామని బీజేపీ లో చేరాలని ఆఫర్ చేసి చర్చలు జరపడానికి మొయినాబాద్ లోని ఫార్మ్ హౌజ్ లో వారిని కలిశారు.

అయితే నలుగురు ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫార్మ్ హౌజ్ పై పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ రెడ్డి పిర్యాదు ఆధారంగా పోలీసులు ఆ ముగ్గురిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.

ఒక వేళ పార్టీ మారక పోతే సీబీఐ, ఈడీ కేసులు ఉంటాయని కూడా బెదిరించారని రోహిత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు.

First Published:  28 Oct 2022 10:38 AM IST
Next Story