ఆటో డ్రైవర్ల ధర్నాకు పర్మిషన్
రేపు ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్లు
BY Naveen Kamera4 Nov 2024 5:41 PM IST
X
Naveen Kamera Updated On: 4 Nov 2024 5:41 PM IST
మహాలక్ష్మీ స్కీమ్ తో నష్టపోయిన ఆటోడ్రైవర్ల ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇందిరాపార్క్ వద్ద మంగళవారం భారీ ఆందోళనకు ఆటోడ్రైవర్లు పిలుపునిచ్చారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో తాము ఇబ్బంది పడుతున్నామని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేస్తామని ఆటోడ్రైవర్లు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ధర్నాకు నగర పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15 వేల పరిహారం ఇవ్వాలని, రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా సదుపాయం కల్పించాలనే డిమండ్లతో ధర్నా చేపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా 20 వేల ఆటోలకు పర్మిట్లు ఇవ్వడంతో పాటు మీటర్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story