Telugu Global
Telangana

కేటీఆర్ వెహికిల్‌ను తనిఖీ చేసిన పోలీసులు

సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోనూ పోటీ చేస్తుండటంతో అక్క‌డ గెలుపు బాధ్య‌త‌ల‌ను మంత్రి కేటీఆర్ తీసుకున్నారు.

కేటీఆర్ వెహికిల్‌ను తనిఖీ చేసిన పోలీసులు
X

తెలంగాణ‌లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేప‌డుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ని తనిఖీ చేశారు పోలీసులు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గానికి బ‌య‌ల్దేరిన మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ని తూప్రాన్ వ‌ద్ద‌ ఆపిన పోలీసులు.. వాహ‌నాల‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీస్ సిబ్బందికి మంత్రి కేటీఆర్ పూర్తిగా సహకరించారు. తనిఖీ అనంతరం కామారెడ్డికి బయల్దేరివెళ్లారు.



సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోనూ పోటీ చేస్తుండటంతో అక్క‌డ గెలుపు బాధ్య‌త‌ల‌ను మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. కామారెడ్డిలో వరుస మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. కేసీఆర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కామారెడ్డి నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు.




ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ వాహ‌నాల తనిఖీల్లో దాదాపు రూ.412 కోట్లకు పైగా సొత్తును పోలీసులు సీజ్ చేశారు. ఇందులో 145 కోట్ల రూపాయల నగదు, రూ. 165 కోట్ల విలువైన అభరణాలు ఉన్నాయి. మరో రూ.39 కోట్ల విలువైన మద్యం, రూ.22 కోట్ల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.




First Published:  1 Nov 2023 1:13 PM IST
Next Story