Telugu Global
Telangana

బాల్క సుమన్ ఇంటికి పోలీసులు.. రియాక్షన్ ఇదే.!

కాంగ్రెస్‌ ప్రభుత్వం తన మీద అక్రమంగా కేసులు పెట్టిందన్నారు. ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీ బీఆర్ఎస్‌ అని.. కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల తరఫున తన పోరాటం కొనసాగుతుందన్నారు.

బాల్క సుమన్ ఇంటికి పోలీసులు.. రియాక్షన్ ఇదే.!
X

మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు, దూష‌ణ‌లు చేసిన సీఎం రేవంత్‌ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సుమన్‌పై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే తాజాగా బాల్క సుమన్‌కు నోటీసులు జారీ చేశారు. సుమన్‌ను కలిసిన మంచిర్యాల ఎస్సై సుమన్‌కు నోటీసులు ఇచ్చారు.

నోటీసులు తీసుకున్న సుమన్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వం తన మీద అక్రమంగా కేసులు పెట్టిందన్నారు. ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీ బీఆర్ఎస్‌ అని.. కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల తరఫున తన పోరాటం కొనసాగుతుందన్నారు.


ఇటీవల మంచిర్యాలలో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు బాల్క సుమన్. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టిన బాల్క సుమన్‌.. రేవంత్‌ను చెప్పుతో కొడతామంటూ చెప్పు చూపించారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక బాల్క సుమన్ నేపాల్ పారిపోయాడంటూ తప్పుడు ప్రచారం కూడా జరిగింది.

First Published:  11 Feb 2024 12:53 PM IST
Next Story