Telugu Global
Telangana

చాక్లెట్ల రూపంలో గంజాయి విక్ర‌యం.. - నిందితులు అరెస్ట్‌

ఈ వ్య‌వ‌హారం వెనుక ఇంకా ఎవ‌రెవ‌రు ఉన్నారు..? ఈ చాక్లెట్ల‌ను ఎక్క‌డ త‌యారు చేస్తున్నారు..? ఎలా స‌ర‌ఫ‌రా చేస్తున్నారు..? వీటిలో గంజాయిని ఎంత మోతాదులో చొప్పిస్తున్నారు..? త‌దిత‌ర వివ‌రాల‌ను తెలుసుకునే దిశ‌గా పోలీసులు త‌మ ద‌ర్యాప్తును కొన‌సాగిస్తున్నారు.

చాక్లెట్ల రూపంలో గంజాయి విక్ర‌యం.. - నిందితులు అరెస్ట్‌
X

గంజాయి విక్ర‌యాల‌కు కొత్త మార్గం క‌నిపెట్టారు అక్ర‌మార్కులు. వీటితో ప్ర‌జ‌లంతా.. ముఖ్యంగా పిల్ల‌లు అత్యంత‌ ఇష్టంగా తినే చాక్లెట్ల రూపంలో వీటిని మార్కెట్లో విక్ర‌యానికి పెట్టిన ఈ ముఠా గుట్టును హైద‌రాబాద్ పోలీసులు శుక్ర‌వారం ర‌ట్టు చేశారు. నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

హైద‌రాబాద్‌లోని ప‌టాన్‌ చెరులో గంజాయి చాక్లెట్లు విక్ర‌యిస్తున్న విష‌యాన్ని తెలుసుకున్న పోలీసులు దాడి చేసి ఆ ముఠాను అరెస్ట్ చేశారు. అరెస్ట‌యిన‌వారిలో ఒడిశాకు చెందిన అనిమేష్‌, రంజిత‌, బాజ్ర మోహ‌న్ ఉన్నారు. వీరు గంజాయి చాక్లెట్లు త‌యారుచేసి.. వాటిని ఆక‌ర్ష‌ణీయ‌మైన వ్యాప‌ర్ల‌లో పెట్టి ఒక్కొక్క‌టి రూ.20 చొప్పున విక్ర‌యిస్తున్నారు. చార్మినార్ గోల్డ్ మునాఖ్చా పేరుతో ఈ చాక్లెట్ల‌ను విక్ర‌యిస్తున్నారు. ప్ర‌స్తుతం వారికి బాగా ప‌రిచ‌య‌స్తుల‌కు మాత్ర‌మే వీరు ఈ చాక్లెట్లు అమ్ముతున్న‌ట్టు తెలిసింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఈ ముగ్గురికి చెందిన షాపుల‌పై దాడి చేసి వారి నుంచి 271 చాక్లెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్య‌వ‌హారం వెనుక ఇంకా ఎవ‌రెవ‌రు ఉన్నారు..? ఈ చాక్లెట్ల‌ను ఎక్క‌డ త‌యారు చేస్తున్నారు..? ఎలా స‌ర‌ఫ‌రా చేస్తున్నారు..? వీటిలో గంజాయిని ఎంత మోతాదులో చొప్పిస్తున్నారు..? త‌దిత‌ర వివ‌రాల‌ను తెలుసుకునే దిశ‌గా పోలీసులు త‌మ ద‌ర్యాప్తును కొన‌సాగిస్తున్నారు.

First Published:  9 Dec 2022 8:35 AM GMT
Next Story