అర్ధరాత్రి పోలీసుల, ప్రభుత్వ దమనకాండ సరికాదు
ప్రభుత్వ తీరు అమానుషమని లగచర్ల వాసులను విడుదల చేయాలని హరీశ్ డిమాండ్
అర్ధరాత్రి లగచర్ల గ్రామస్తులను అరెస్టు చేయడం పై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. 300 మంది పోలీసులు గ్రామానికి చేరుకుని అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ తీరు అమానుషమని లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అర్ధరాత్రి పోలీసుల, ప్రభుత్వ దమనకాండ సరికాదన్నారు. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా భూసేకరణపై సీఎం ఉద్దేశం తెలియాన్నారు. సీఎం వ్యక్తిగత లబ్ధి కోసం చేపడుతున్న భూసేకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు: కేటీఆర్
అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరని, బెదిరింపులతో రైతులను భయపెట్టలేరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో సోమవారం చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో జరిగిన అరెస్టులపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్టు చేస్తారా? రైతులను తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఇదేనా ప్రజాస్వామ్య పాలనా? రైతు సంక్షేమ పాలన? పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దంటే రైతుల అరెస్టులా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రైతుల అరెస్టలను ఖండిస్తున్నామని, పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తున్నామన్నారు. లగచర్ల గ్రామస్థుల పోరాటానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుదన్నారు.