మైనర్ కూతురిపై సీఐ అత్యాచారం
మేమున్నాం.. అని ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఓ పోలీస్ ఆఫీసర్ దారుణానికి ఒడిగట్టాడు.
మేమున్నాం.. అని ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఓ పోలీస్ ఆఫీసర్ దారుణానికి ఒడిగట్టాడు. బాధ్యతాయుతమైన సీఐ హోదాలో ఉన్న అతడు.. విచక్షణ మరిచి మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై హనుమకొండ జిల్లా కేయూ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం అత్యాచారం, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
భూపాలపల్లి సీఐగా ఉన్న బండారి సంపత్ 2022లో కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ ఎస్సైగా పనిచేశాడు. ఆ సమయంలో హనుమకొండకు చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో ఆ మహిళ తన భర్తను వదిలిపెట్టి కొంతకాలంగా సీఐ సంపత్‌తో సహజీవనం చేసింది. ఖమ్మం జిల్లాకు సీఐగా బదిలీ అయ్యాక కూడా వారి సాన్నిహిత్యం కొనసాగింది. అనంతరం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆమెకు అప్పటికే పదేళ్ల కూతురు ఉంది. ఇపుడు ఆ బాలికకు 16ఏళ్లు.
ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే తండ్రిగా వ్యవహరించాల్సిన సీఐ సంపత్ ఆ బాలికపైనే కన్నేశాడు. మృగంలా మారి కూతిరిపైనే అత్యాచారం చేశాడు.
బాధిత బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె కేయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి విచారణ చేపట్టారు. లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణకు వచ్చి అత్యాచారం, పోక్సో కింద కేసు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం అప్పటి పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషిని కలిసి సీఐ సంపత్ తన భార్యను తీసుకెళ్లాడని మొదటి భర్త ఫిర్యాదు చేశాడు. అప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సంపత్‌ను ఏఆర్‌కు అటాచ్ చేశారు. తాజాగా ఆమె కూతురిపై ఇలా దారుణానికి ఒడిగట్టాడు.