Telugu Global
Telangana

ఈనెల 12న తెలంగాణకు మోదీ.. రాజకీయాలు మాట్లాడే ధైర్యముందా..?

రేపు మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలతో బీజేపీ మరింత డీలా పడటం ఖాయం. ఈ దశలో బీజేపీకి కనీసం స్పందించే అవకాశం కూడా ఉండదు. అందుకే రామగుండం సభలో మోదీ రాజకీయాలు మాట్లడే అవకాశమే లేదని అంచనా వేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.

ఈనెల 12న తెలంగాణకు మోదీ.. రాజకీయాలు మాట్లాడే ధైర్యముందా..?
X

ఈనెల 11న ఏపీ పర్యటనకు రాబోతున్న మోదీ, 12న తెలంగాణలో పర్యటిస్తారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని మోదీ జాతికి అంకితం చేయడంతోపాటు, పలు జాతీయ రహదారులకు కూడా శంకుస్థాపన చేసే అవకాశముంది. ఆ తర్వాత రామగుండంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగసభలో మోదీ ప్రసంగింస్తారని అంటున్నారు. అధికారికంగా షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉండగా, ఇప్పటినుంచే బీజేపీ హడావిడి మొదలు పెట్టింది. మోదీ తెలంగాణ సభలో టీఆర్ఎస్ పై విరుచుకుపడతారని, నిప్పులు చెరుగుతారని, ఇటీవల కేసీఆర్ చేసిన ఆరోపణలకు ధీటుగా బదులిస్తారనే ప్రచారం జరుగుతోంది.

మోదీకి అంత సీన్ ఉందా..?

నిజంగానే మోదీకి అంత సీన్ ఉంటే, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికే వచ్చేవారు. ఓటమి ఖాయం కావడంతో ఆయన ప్రచారానికి మొహం చాటేశారు, ఆయనతోపాటు జాతీయ నాయకులు కూడా మునుగోడువైపు చూడలేదు. ఇప్పుడు కొత్తగా రామగుండం సభలో మోదీ రెచ్చిపోతారని అనుకోలేం. రేపు మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలతో బీజేపీ మరింత డీలా పడటం ఖాయం. ఈ దశలో బీజేపీకి కనీసం స్పందించే అవకాశం కూడా ఉండదు. అందుకే రామగుండం సభలో మోదీ రాజకీయాలు మాట్లడే అవకాశమే లేదని అంచనా వేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.

ఎమ్మెల్యేల బేరసారాలపై స్పందిస్తారా..?

నిజంగానే మోదీ రాజకీయాలు మాట్లాడితే, ఎమ్మెల్యేలతో జరిగిన బేరసారాలపై స్పందించాల్సి ఉంటుంది. నిందితులు ముగ్గురికీ బీజేపీతో సంబంధం లేదు అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అలా చెబితే వైరి వర్గాలు ఊరుకుంటాయా.. ఆముగ్గురితో మోదీకి ఉన్న సంబంధాలపై ఆరాతీసి మరీ బయటపెడతాయి. ఇప్పటికే కిషన్ రెడ్డి, నందకుమార్ తో తనకున్న సంబంధాన్ని కవర్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. వారంతా కిరాయి ఆర్టిస్ట్ లు అని బీజేపీ నేతలు అంటున్నా కూడా జనం నమ్మట్లేదు. వారు బీజేపీ దూతలనే నమ్ముతున్నారు. ఈ దశలో ఆ ఎపిసోడ్ ని మోదీ టచ్ చేస్తారనుకోలేం. మునుగోడు ఉప ఎన్నిక, ఎమ్మెల్యేలతో జరిగిన బేరసారాలు.. ఇలా ప్రస్తుతం చర్చలో ఉన్న అంశాల జోలికి వెళ్లకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించేంత సాహసం మోదీ చేయరు. సో ఇది కేవలం మోదీ పర్యటనగానే మిగిలిపోతుంది కానీ, రాజకీయ విమర్శలకు చోటు ఉండదని అంటున్నారు. అదే జరిగితే తెలంగాణ బీజేపీ శ్రేణులకు అది పెద్ద నిరాశేనని చెప్పాలి.

First Published:  5 Nov 2022 9:52 AM IST
Next Story