శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఎయిర్ ఏషియా విమానం ఒకటి గత అర్ధరాత్రి అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
BY Vamshi Kotas16 March 2025 11:27 AM IST

X
Vamshi Kotas Updated On: 16 March 2025 11:27 AM IST
శంషాబాద్‌లో విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా విమానం ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. కౌలాలంపూర్ నుంచి శంషాబాద్‌కు వస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు గమనించిన పైలెట్ ఎయిర్ పోర్టు అధికారులను సమాచారమిచ్చారు. దీంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. విమానంలో 73 మంది ప్రయాణికులున్నారు. విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనపై ఎయిర్ ఏషియా అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Next Story