Telugu Global
Telangana

పీజేఆర్ కుటుంబం దగ్గర రూ.5 కోట్లు డిమాండ్ చేసింది ఎవరు..?

తన కుటుంబానికి మోసం జరిగిందని వివరించారు విష్ణువర్దన్ రెడ్డి. సీఎం కేసీఆర్‌ లక్ష్యమైనా.. తన తండ్రి పీజేఆర్‌ ఆశయ సాధనైనా ఒక్కటేనన్నారు. అందుకే తాను బీఆర్ఎస్ లో అడుగు పెట్టానన్నారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ తరపున విష్ణు ప్రచారం మొదలుపెట్టారు.

పీజేఆర్ కుటుంబం దగ్గర రూ.5 కోట్లు డిమాండ్ చేసింది ఎవరు..?
X

కాంగ్రెస్‌ పార్టీకి 52 ఏళ్లు సేవ చేసిన పీజేఆర్‌ కుటుంబానికి టికెట్‌ ఇచ్చేందుకు రూ.5 కోట్లు డిమాండ్‌ చేశారంటే అంతకన్నా అవమానం మరొకటి లేదన్నారు పీజేఆర్ తనయుడు విష్ణువర్దన్ రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని అన్నారు. తన దగ్గర డబ్బులు డిమాండ్ చేసింది ఎవరనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. తన కుటుంబానికి మోసం జరిగిందని వివరించారు విష్ణువర్దన్ రెడ్డి. సీఎం కేసీఆర్‌ లక్ష్యమైనా.. తన తండ్రి పీజేఆర్‌ ఆశయ సాధనైనా ఒక్కటేనన్నారు విష్ణు. అందుకే తాను బీఆర్ఎస్ లో అడుగుపెట్టానన్నారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ తరపున ఆయన ప్రచారం మొదలుపెట్టారు.

జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్, బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విష్ణువర్దన్ రెడ్డి, మాగంటికి తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. గతంలో తనకు వచ్చిన 56వేల పీజేఆర్ అభిమానుల ఓట్లు కూడా ఈసారి మాగంటికి ట్రాన్స్ ఫర్ కావాలన్నారు విష్ణు. ఆయనకు బంపర్ మెజార్టీ రావాలని ఆకాంక్షించారు, తన అభిమానులకు పిలుపునిచ్చారు.

పెరిగిన బలం..

కాంగ్రెస్ పార్టీ టికెట్లు నిరాకరించడంతో అసంతృప్తికి లోనైన నేతలు వెంటనే బీఆర్ఎస్ లోకి వచ్చారు. అలా చేరికలతో ఆయా స్థానాల్లో బీఆర్ఎస్ బలం మరింత పెరిగింది. జూబ్లీహిల్స్ లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కి ఇప్పుడు పీజేఆర్ అభిమానుల ఓట్లు తోడవుతున్నాయి. తనకంటే వయసులో చిన్నవాడైనా జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యేగా తన కంటే విష్ణు సీనియర్‌ అని, ఆయన తనకు సోదర సమానుడని అన్నారు.


First Published:  4 Nov 2023 6:21 AM GMT
Next Story