ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.. కొండా సురేఖకు కేటీఆర్ వార్నింగ్
మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసి పలువురు సినిమా హీరోయిన్లను బెదిరించారని కామెంట్ చేశారు. ఈ ఆరోపణలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర దుమారం రేపుతున్న అంశం తెలిసిందే. తమ ఫోన్లను గత ప్రభుత్వం ట్యాప్ చేసిందంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరుసగా ఫిర్యాదు చేస్తున్నారు. ఇక మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా స్పందించారు.
కాంగ్రెస్ సీనియర్ లీడర్ కె.కె.మహేందర్ రెడ్డి సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో తన ఫోన్ ట్యాప్ చేయాలని కేటీఆర్ ఆదేశించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సైతం మార్చి 26న డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు.
ఇక మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసి పలువురు సినిమా హీరోయిన్లను బెదిరించారని కామెంట్ చేశారు. ఈ ఆరోపణలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కె.కె. మహేందర్ రెడ్డితో పాటు కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు. అవమానించే విధంగా, నిరాధారమైన, అర్థంలేని ఆరోపణలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరంగా వచ్చే పరిణామాలను ఎదుర్కొవాలని వార్నింగ్ ఇచ్చారు.