Telugu Global
Telangana

రేవంత్‌ పై ప్రజల తిరుగుబాటు తప్పదు

బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌

రేవంత్‌ పై ప్రజల తిరుగుబాటు తప్పదు
X

శ్రీలంకలో రాజపక్సే సోదరులపై ప్రజలు తిరుగుబాటు చేసినట్టే తెలంగాణలో రేవంత్‌ రెడ్డిపై ప్రజా తిరుగుబాటు తప్పదని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. రేవంత్‌ బండారం త్వరలోనే బట్టబయలు అవుతుందన్నారు. తెలంగాణ భవన్‌ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ బ్యాంకుతో రేవంత్‌ కుమ్మక్కయ్యే మూసీ సుందరీకరణ అంటున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు పేరుతో రూ.1.50 లక్షల కోట్ల అవినీతిని బీఆర్‌ఎస్‌ అడ్డుకుంటోందనే కాంగ్రెస్‌ నాయకులు దాడులు చేస్తున్నారని అన్నారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌ లో భాగంగానే రేవంత్‌ రెడ్డి కొండా సురేఖతో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయించారని అన్నారు. ఆమెకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదన్నారు. ఆమె వ్యాఖ్యలపై లీగల్‌ గా చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. రేవంత్‌ ప్రపంచ బ్యాంకు వైపు ఉంటే, బీఆర్ఎస్‌ పీడిత ప్రజల పక్షాన ఉందన్నారు. రేవంత్‌ ధన దాహానికి హైడ్రా ఆయుధంలా మారిందన్నారు. ప్రపంచ బ్యాంకు ఏజెంట్లు ఎన్ని దాడులు చేసినా ఎదుర్కొంటామన్నారు. పట్టపగలు కేటీఆర్ కారుపై దాడి చేశారని, ఖమ్మంలో హరీశ్‌ రావు, మాజీ మంత్రుల మీద దాడులు చేశారని తెలిపారు. కేటీఆర్‌ ను అడ్డుకున్నట్టు యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మొత రోహిత్‌ ట్వీట్‌ చేశారని, అయినా పోలీసులు అతడిపై చర్యలు తీసుకోలేదన్నారు. వారిని అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారన్నారు. రేవంత్‌ కుట్రలో పోలీసులు పావులు మారుతున్నారని అన్నారు.

First Published:  2 Oct 2024 5:17 PM IST
Next Story