Telugu Global
Telangana

పట్నం ప్రమాణ స్వీకారం.. 3 నెలల మంత్రిగా అరుదైన రికార్డ్

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌ తో 2021 మే నుంచి ఖాళీగా ఉన్న స్థానంలో మహేందర్‌ రెడ్డికి అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. ఆయనకు ప్రస్తుతం అదే శాఖను కేటాయిస్తారని తెలుస్తోంది. పోర్ట్ ఫోలియో గురించి అధికారిక సమాచారం విడుదల కావాల్సి ఉంది.

పట్నం ప్రమాణ స్వీకారం.. 3 నెలల మంత్రిగా అరుదైన రికార్డ్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో విడుదలవుతుందన్న వార్తల నేపథ్యంలో అతి తక్కువ కాలానికి మంత్రిగా పనిచేసే అవకాశం పట్నం మహేందర్ రెడ్డికి దక్కింది. మంత్రి పదవి ఆయనకు కొత్త కాకపోయినా.. సరిగ్గా ఎన్నికల వేళ ఈ అవకాశం వరించడం మాత్రం విశేషం. తాండూరు అసెంబ్లీ సీటు విషయంలో సర్దుకుపోవడంతో పట్నంకు కేబినెట్ లో అవకాశం లభించింది. ఈరోజు మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌ తో 2021 మే నుంచి ఖాళీగా ఉన్న స్థానంలో మహేందర్‌ రెడ్డికి అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. ఆయనకు ప్రస్తుతం అదే శాఖను కేటాయిస్తారని తెలుస్తోంది. పోర్ట్ ఫోలియో గురించి అధికారిక సమాచారం విడుదల కావాల్సి ఉంది.

తొలి రవాణా మంత్రి..

పట్నం మహేందర్‌ రెడ్డి 4సార్లు తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 లో ఎమ్మెల్యేగా గెలిచి, కేసీఆర్ తొలి మంత్రి వర్గంలో ఛాన్స్ పట్టేశారు పట్నం. తెలంగాణకు తొలి రవాణా శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనను బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా చేసింది. కాలక్రమంలో పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరడంతో తాండూరు టికెట్ల లొల్లి మొదలైంది. దీన్ని సామరస్యంగా పరిష్కరించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే టికెట్ రోహిత్ రెడ్డికి ఇచ్చారు, మంత్రి పదవి పట్నం మహేందర్ రెడ్డికి సర్దుబాటు చేశారు. సమన్యాయం చేశారు. దీంతో అనుకోకుండా ఎన్నికల ముందు పట్నంను మంత్రి పదవి వరించింది. అయితే తక్కువకాలం మంత్రిగా పనిచేసే అరుదైన రికార్డు ఆయన సొంతం కాబోతోంది.

First Published:  24 Aug 2023 10:50 AM GMT
Next Story