పట్నం నరేందర్‌రెడ్డి పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
మెరిట్స్ ఆధారంగా బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని కింది కోర్టుకు ఆదేశం
BY Raju Asari4 Dec 2024 11:19 AM IST
X
Raju Asari Updated On: 4 Dec 2024 11:19 AM IST
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. కింది కోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలన్న ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. లగచర్ల ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ నరేందర్‌రెడ్డి ఇటీవల క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు కొట్టివేయడంతో పాటు.. మెరిట్స్ ఆధారంగా బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని కింది కోర్టును ఆదేశించింది.
Next Story