వరల్డ్‌కప్ విజయ సారథి.. సన్‌రైజర్స్ తలరాత మారుస్తాడా?
ఐపీఎల్ తొలి సీజన్‌లో డక్కన్ ఛార్జర్స్ విజేతగా నిలిచింది. అప్పుడు కెప్టెన్ ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు గిల్‌క్రిస్ట్. తర్వాత జట్టు మేనేజ్‌మెంట్ మారింది.
ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్ వచ్చాడు. ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 కోట్ల 50 లక్షల రూపాయలకు కొన్నప్పుడే అతడ్ని కెప్టెన్‌ను చేయబోతున్నారని అందరూ ఊహించారు. గత సీజన్లో జట్టును నడిపించిన దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్‌ను తొలగించి కమిన్స్‌ను కెప్టెన్‌ను చేశారు.
ఆస్ట్రేలియాకు రెండు వరల్డ్‌కప్‌లు తెచ్చాడు
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, ఆ జట్టు కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ ప్రపంచ క్రికెట్లో అందరికీ తెలుసు. స్మిత్, వార్నర్ల తర్వాత అనూహ్యంగా ఆస్ట్రేలియా పగ్గాలందుకున్న కమిన్స్ కెప్టెన్‌గా బాగా క్లిక్కయ్యాడు. కెప్టెన్‌గా ఆసీస్‌కు టీ20 వరల్డ్‌కప్ అందించాడు. గత ఏడాది వరల్డ్‌కప్ ఫైనల్లో మనల్ని దెబ్బకొట్టి, కప్పు ఎగరేసుకుపోయిన కంగారూ జట్టుకూ అతనే సారథి.
తలరాత మారుస్తాడా?
ఐపీఎల్ తొలి సీజన్‌లో డక్కన్ ఛార్జర్స్ విజేతగా నిలిచింది. అప్పుడు కెప్టెన్ ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు గిల్‌క్రిస్ట్. తర్వాత జట్టు మేనేజ్‌మెంట్ మారింది. టీమ్ పేరు మారి సన్‌రైజర్స్ హైదరాబాద్ అయింది. దాంతోపాటే జట్టు జాతకమూ మారిపోయింది. నానాటికీ తీసికట్టు ప్రదర్శనతో ఐపీఎల్‌లో ఎందుకు ఆడుతున్నామో తెలియని పరిస్థితిలో ఉంది. గత సీజన్‌లో కేవలం నాలుగు మ్యాచ్‌లు గెలిచి, టేబుల్‌లో చివరి ప్లేస్‌లో నిలిచింది. ఎంతమంది కెప్టెన్లు మారుతున్నా గెలుపుబాట పట్టని సన్‌రైజర్స్ తలరాతను కమిన్స్ మారుస్తాడా అన్నదే ఇప్పుడు ఆసక్తికరం.