శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన
ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం మూడు గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ సాంకేతిక లోపంతో విమానం మూడు గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు విమానాశ్రయంలో ఉండిపోయారు. విమానం ఆలస్యం గురించి తమకు స్పైస్‌జెట్ సిబ్బంది ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. తమకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగానే ఆలస్యమైందని స్పైస్ జెట్ సిబ్బంది తెలిపారు.
ఈ క్రమంలో కుంభమేళాకు వెళ్లాల్సిన భక్తులు ఎయిర్‌ఫోర్టులో నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే వారంతా ఆగ్రహంతో స్పైస్ జెట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఫ్లైట్‌లో ఏదైలో సమస్య వస్తే ప్రయాణికులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని ఫైర్ అయ్యారు. అలా కాకుండా తీరా ఎయిర్‌పోర్టుకు వచ్చాక ఇలా గంటల తరబడి వెయిట్ చేయించడం ఏంటని స్పైస్ జెట్ యాజమాన్యంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు