Telugu Global
Telangana

పేపర్ లీక్ కేసు: డిబార్ అయిన 10th విద్యార్థికి హైకోర్టులో ఊరట‌

టెంత్ పేపర్ లీక్ వ్యవహారంలో అధికారులు విద్యార్థి హరీష్ ను డిబార్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో తన తప్పేం లేదని ఆ విద్యార్థి చెప్పినప్పటికీ అధికారులు వినకపోవడంతో హరీష్ తండ్రి హైకోర్టును ఆశ్ర‌యించారు. తన కొడుకు హరీష్‌ హిందీ పరీక్ష రాస్తున్న సమయంలో ఎవరో బలవంతంగా పేపర్‌ లాక్కున్నారని ఆయన కోర్టుకు తెలిపారు.

పేపర్ లీక్ కేసు: డిబార్ అయిన 10th విద్యార్థికి హైకోర్టులో ఊరట‌
X

పేపర్ లీకేజ్ వ్యవహారంలో డిబార్ అయిన పదవ తరగతి విద్యార్థి హ‌రీష్ కు హైకోర్టులో ఊరట లభించింది. హన్మకొండ జిల్లా కమాలాపూర్ మండల్ ఉప్పల్ లో పదవతరగతి హిందీ పరీక్ష జరుగుతుండగా ఓ బాలుడు హరీష్ వద్ద నుంచి పరీక్ష పేపర్ లాక్కొని ఫోటో తీసుకున్న విషయం తెలిసిందే.

ఆ బాలుడు తీసిన ప‌రీక్ష పత్రం ఫోటోలు వాట్స‌ప్ లో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన పోలీసులు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో సహా పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంలో అధికారులు విద్యార్థి హరీష్ ను డిబార్ చేశారు. ఇందులో తన తప్పేం లేదని ఆ విద్యార్థి చెప్పినప్పటికీ అధికారులు వినకపోవడంతో హరీష్ తండ్రి హైకోర్టును ఆశ్ర‌యించారు. తన కొడుకు హరీష్‌ హిందీ పరీక్ష రాస్తున్న సమయంలో ఎవరో బలవంతంగా పేపర్‌ లాక్కున్నారని ఆయన కోర్టుకు తెలిపారు.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కూడా తన కొడుకు పేరు ఎక్కడా లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఈ విష‌యాలన్నీన్ని అధికారుల దృష్టికి తెచ్చినప్పటికీ అధికారులు శుక్రవారం నాటి పరీక్షను రాసేందుకు తన కొడుకును అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును రాజకీయాలకు బలి చేశారని ఆరోపించిన ఆయన హరీష్‌ను టెన్త్‌ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు.

ఈ అంశంపై ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు హరీష్ ను పరీక్షలు రాసేందుకు అనుమతించాలని అధికారులను ఆదేశించింది. సోమవారం నుండి హరీష్ మిగతా పరీక్షలు రాయనున్నాడు.

First Published:  8 April 2023 11:08 AM
Next Story