Telugu Global
Telangana

పంజాగుట్ట చౌరస్తాకు డాక్టర్ అంబేద్కర్ పేరు పెడతాం : మంత్రి కేటీఆర్

సెక్రటేరియట్‌కు మహనీయుడు అంబేద్కర్ పేరు పెట్టడం కేసీఆర్‌కే సాధ్యమైందని అన్నారు. పంజాగుట్ట కూడలికి అంబేద్కర్ పేరు పెడతామని కేటీఆర్ ప్రకటించారు.

పంజాగుట్ట చౌరస్తాకు డాక్టర్ అంబేద్కర్ పేరు పెడతాం : మంత్రి కేటీఆర్
X

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అంబేద్కరే లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రమే లేదని ఆయన అభివర్ణించారు. దళితుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని, దళిత బంధు వంటి సాహసోపేతమైన పథకాన్ని ప్రారంభించిన ఘనత ముఖ్యమంత్రిదే అని కేటీఆర్ అన్నారు.

డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబా సాహెబ్ విగ్రహాన్ని పంజాగుట్ట చౌరస్తాలో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెక్రటేరియట్‌కు మహనీయుడు అంబేద్కర్ పేరు పెట్టడం కేసీఆర్‌కే సాధ్యమైందని అన్నారు. పంజాగుట్ట కూడలికి అంబేద్కర్ పేరు పెడతామని కేటీఆర్ ప్రకటించారు. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

దళితుల కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న దళిత బంధు పథకం దేశానికే దిక్సూచిలా మారిందని కేటీఆర్ అన్నారు. ఎంతో మంది సామాన్య దళితులు ఇప్పుడు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని చెప్పారు. దళిత కుటుంబాలు ఇప్పుడు సొంతగా పరిశ్రమలు పెట్టడమే కాకుండా నలుగురికి ఉపాధిని కల్పిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. ఇదంతా దళిత బంధు వల్లే సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.


First Published:  14 April 2023 9:01 AM GMT
Next Story