Telugu Global
Telangana

స్టార్ హోటల్స్ లో కల్లు.. కాంగ్రెస్ కొత్త పాలసీ

గౌడ సంఘం నాయకుల్ని కలసిన సందర్భంలో మంత్రులు కల్లు వ్యవహారంపై ఘనంగా హామీలిచ్చారు. స్టార్ హోటళ్లలో కల్లు అందుబాటులోకి తెస్తామన్నారు.

స్టార్ హోటల్స్ లో కల్లు.. కాంగ్రెస్ కొత్త పాలసీ
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త విధానాలు మొదలయ్యాయి. TS నుంచి TG, యాదాద్రి టు యాదగిరిగుట్ట.. వంటి పేరు మార్పు వ్యవహారాలు కామన్ గా మారిపోయాయి. ఇక ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా చేపట్టే కార్యక్రమాలు సరేసరి. వీటితోపాటు మరికొన్ని సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు మంత్రులు. తెలంగాణలోని స్టార్ హోటల్స్ లో కల్లు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడతామన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. కల్లుగీత కార్మికుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు కొత్త విధానాలపై హామీలిచ్చారు.

బీఆర్ఎస్ హయాంలో నీరా కేఫ్ లు ప్రారంభించగా.. నీరా ఉత్పత్తిని పెంచి హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా విక్రయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రులు పొన్నం, జూపల్లి. గౌడన్నలకు ఈత, ఖర్జూర వనాలు పెంచడానికి ఐదెకరాల ప్రభుత్వ స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

పెళ్లిళ్లలోనూ కల్లు..

పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సందర్భంలో బంధు మిత్రులు సంబరాలు చేసుకునే సమయంలో విందుతోపాటు మందు కూడా సహజంగా మారింది. మందుతోపాటు కల్లు కూడా ఉండాలంటున్నారు మంత్రి పొన్నం. శుభకార్యాలప్పుడు కల్లు అందుబాటులో ఉంటే బాగుంటుందని అన్నారు పొన్నం. మొత్తమ్మీద గౌడ సంఘం నాయకుల్ని కలసిన సందర్భంలో మంత్రులు కల్లు వ్యవహారంపై ఘనంగానే హామీలిచ్చారు. కల్లుగీత కార్మికులకు అండగా ఉంటామన్నారు. స్టార్ హోటళ్లలో కల్లు అందుబాటులోకి తెస్తామన్నారు.

First Published:  4 March 2024 8:22 AM IST
Next Story