Telugu Global
Telangana

ఈ నెలలోనే పాలమూరు ప్రారంభం.. నేడు కేసీఆర్ రివ్యూ..!

త్వరలోనే ప్రాజెక్టు ప్రారంభానికి రాష్ట్రప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ నెల 15 లేదా 17 తేదీల్లో ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ నెలలోనే పాలమూరు ప్రారంభం.. నేడు కేసీఆర్ రివ్యూ..!
X

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సెక్రటేరియట్‌లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లతో సీఎం సమావేశం అవుతారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై విస్తృతంగా చర్చ జరపనున్నారు.

ఇక పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవలే డ్రైరన్ నిర్వహించారు. డ్రైరన్ సక్సెస్ కావడంతో అధికారులు వెట్‌రన్‌కు రెడీ అవుతున్నారు. త్వరలోనే ప్రాజెక్టు ప్రారంభానికి రాష్ట్రప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ నెల 15 లేదా 17 తేదీల్లో ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కరివెన రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై కేసీఆర్ ఇవాళ రివ్యూ చేయనున్నారు. అక్కడక్కడా పూర్తి చేయాల్సిన పనులు, క్షేత్రస్థాయి ఇబ్బందులపై కేసీఆర్ దృష్టి పెట్టనున్నారు. కాల్వల నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను కూడా ఇప్పటికే ప్రారంభించారు.

నార్లాపూర్‌ దగ్గర ఇటీవల నిర్వహించిన డ్రైరన్‌ సక్సెస్‌ కావడంతో అక్కడే ప్రాజెక్టు పనులపై సమీక్షించారు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్. ఈ సందర్భంగా నార్లాపూర్‌ దగ్గర 4 మోటార్లను అమర్చామని..అందులో మొదటి పంపును సక్సెస్‌ఫుల్‌గా టెస్టు చేశామన్నారు. మరో 15 రోజుల్లో ఒక పంపు ద్వారా నీళ్లను ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ఒక్కొ మోటారు 3 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుందని.. నిబంధనల ప్రకారం ముందుగా నార్లాపూర్‌ రిజర్వాయర్‌ను నింపిన తర్వాత కరివెన రిజర్వాయర్‌ వరకు నీళ్లు తీసుకువస్తామన్నారు. ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం తరహాలోనే..పాలమూరు-రంగారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు వరదాయిని అని చెప్పుకొచ్చారు.

*

First Published:  6 Sept 2023 4:52 AM GMT
Next Story