Telugu Global
Telangana

హైదరాబాద్ మహారాష్ట్ర, విదర్భల్లో పెరుగుతున్న బీఆర్ఎస్‌ హవా

ఇప్పటికే ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ లో భాగమైన, నాందేడ్, ఔరంగాబాద్ ప్రాంతాల్లో వివిధ‌ పార్టీల నుండి పెద్ద ఎత్తున నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. నాందేడ్, కాందార్ లోహా, ఔరంగాబాద్ లలో జరిగిన బీఆర్ఎస్‌ బహిరంగ సభలకు లక్షలాదిగా ప్రజలు హాజరయ్యారు. ఆ ప్రాంతాల్లో ఇప్పటికే స్థానిక నాయకులు గ్రామాల్లోకి బీఆర్ఎస్‌ను తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో విదర్భలో కూడా బీఆర్ఎస్‌ విస్తరణ సాగుతోంది.

హైదరాబాద్ మహారాష్ట్ర, విదర్భల్లో పెరుగుతున్న బీఆర్ఎస్‌ హవా
X

భారత రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ప్రధానంగా మహారాష్ట్ర పై దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే మహారాష్ట్రలో మూడు బహిరంగసభలు నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు అనేక మంది బీఆర్ఎస్‌లో చేరారు, చేరుతున్నారు.

ఇప్పటికే ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ లో భాగమైన, నాందేడ్, ఔరంగాబాద్ ప్రాంతాల్లో వివిధ‌ పార్టీల నుండి పెద్ద ఎత్తున నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. నాందేడ్, కాందార్ లోహా, ఔరంగాబాద్ లలో జరిగిన బీఆర్ఎస్‌ బహిరంగ సభలకు లక్షలాదిగా ప్రజలు హాజరయ్యారు. ఆ ప్రాంతాల్లో ఇప్పటికే స్థానిక నాయకులు గ్రామాల్లోకి బీఆర్ఎస్‌ను తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో విదర్భలో కూడా బీఆర్ఎస్‌ విస్తరణ సాగుతోంది.

విదర్భ ప్రాంతం నుంచి కూడా అధికార బీజేపీతో సహా వివిధ పార్టీలకు చెందిన చెందిన వందలాది మందినాయకులు బీఆర్ఎస్‌లో చేరుతున్నారు.

గురువారం, భండారా జిల్లాలోని తుమ్సర్‌కు చెందిన బిజెపి మాజీ ఎమ్మెల్యే చరణ్ వాగ్మారే నేతృత్వంలో 100 మందికి పైగా ముఖ్యమైన నాయకులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

జిల్లా పరిషత్ సభ్యులు, తుమ్సార్ నగర్ పరిషత్ సభ్యులు, సర్పంచ్‌లు, నగర సేవకులు బీఆర్‌ఎస్‌లో చేరినవారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

తమ ప్రాంతం ను‍ండి త్వరలోనే పెద్దఎత్తున బీఆర్ఎస్‌లో చేరికలు ఉంటాయని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చరణ్ వాగ్మారే తెలిపారు.

First Published:  28 April 2023 9:12 AM IST
Next Story