మా ఓటు బీఆర్ఎస్ కే.. ఇంటి గోడలపై యజమానుల తీర్మానాలు
మా ఓటు బీఆర్ఎస్ కే అని చెబుతున్న ప్రజలు, ప్రభుత్వం నుంచి తాము ఎలాంటి లబ్ధి పొందుతున్నామనే విషయాన్ని కూడా వివరిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పొందుతున్నాం కాబట్టే తాము ఆ పార్టీకి ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు.
ఇటీవల పలు నియోజకవర్గాల ప్రజలు మా ఓటు బీఆర్ఎస్ కే అంటూ తీర్మానాలు చేసి, ఆ కాపీలను ఆయా నాయకులకు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ ప్రజలు మరో అడుగు ముందుకేశారు. తమ ఇంటి గోడలపై తమ తీర్మానాలు రాసేస్తున్నారు. ఇతర పార్టీల నాయకులెవరూ తమని ఓటు అడగొద్దని, తాము బీఆర్ఎస్ కే ఓటు వేస్తామని చెబుతున్నారు. ఏకంగా ఇంటి గోడలపైనే తీర్మానాలు రాసి ఉంచడం ఆసక్తికరంగా మారింది.
మాకు ఏయే పథకాలు వస్తున్నాయంటే..
మా ఓటు బీఆర్ఎస్ కే అని చెబుతున్న ప్రజలు, ప్రభుత్వం నుంచి తాము ఎలాంటి లబ్ధి పొందుతున్నామనే విషయాన్ని కూడా వివరిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పొందుతున్నాం కాబట్టే తాము ఆ పార్టీకి ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే తమ ఇంట్లో వారికి పెన్షన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, రైతు రుణమాఫీ, కేసీఆర్ కిట్ వచ్చా యని.. ఇన్ని చేసిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని చెబుతున్నారు. ఇవన్నీ మాకు ఇప్పించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికే మరోసారి మా ఓటు అంటూ వేల్పూర్ మండల ప్రజలు తమ ఇంటి గోడలపై రాసుకుంటు న్నారు.
కరోనా సమయంలో కూడా ప్రభుత్వం తమకు అండగా నిలిచిందని, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడానికి కృషి చేశారని చెబుతున్నారు స్థానికులు. బాల్కొండ నుంచి మరోసారి వేముల గెలుపు ఖాయమని అంటున్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకే తమ అభిప్రాయాలను ఇలా గోడపై రాసుకుంటున్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా బీఆర్ఎస్ కి జై కొట్టడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు ఇతర పార్టీల నేతలు కూడా జంకుతున్నారు.
♦