Telugu Global
Telangana

ప్రజలే కేంద్రంగా మా ప్రభుత్వ పాలన

గవర్నర్‌ ప్రసంగంలో రుణమాఫీ, రైతు భరోసా గురించి ప్రస్తావించినప్పుడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నినాదాలు

ప్రజలే కేంద్రంగా మా ప్రభుత్వ పాలన
X

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఉయభ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగుతున్నది. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ అన్నారు. మా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధితో పాటు అన్నివర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని అన్నారు.ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ. గద్దర్‌ అంజయ్య వంటి ఎందరో ప్రజల కోసం కృషి చేశారు జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నాం. సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నాం. అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తున్నదన్నదని గవర్నర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రైతులు, మహిళలు, యువతకు అన్నివిధాలా సహకారం అందిస్తున్నామన్నారు.రాష్ట్రానికి రైతులే ఆత్మ. వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వాళ్లే అన్నదాతలు అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉందన్నారు. రైతులకు మద్దతు ఇవ్వడం.. వారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దడమే మా బాధ్యత అన్నారు. దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతులకు రుణమాఫీ చేశాం. ఇదే రైతుల పట్ల మా ప్రభుత్వాన్ని చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 25.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని తెలిపారు. ఎకరానికి రూ. 12 వేలు చొప్పున రైతుకలు అందిస్తున్నాం. రైతు నేస్తం అమలు చేస్తున్నాం. వరి రైతులకు రూ. 500 చొప్పున బోనస్‌ ఇస్తున్నాం. రైతుల కోసం వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు చేశాం. మహాలక్ష్మి పథకం గేమ్‌ ఛేంజర్‌గా ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని అన్నారు. గవర్నర్‌ ప్రసంగంలో రుణమాఫీ, రైతు భరోసా గురించి ప్రస్తావించినప్పుడు, బోనస్‌, కృష్ణా జలాల ప్రస్తావన వచ్చినప్పుడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. ఈ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్‌ హాజరయ్యారు. గవర్నర్‌ ప్రసంగం అనంతరం శాసనసభ గురువారానికి వాయిదా పడింది.

First Published:  12 March 2025 11:27 AM IST
Next Story