Telugu Global
Telangana

సీతక్క ఇక డాక్టర్ సీతక్క.. కల నెరవేర్చుకున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యేగా ఉంటూ పీహెచ్‌డీ పూర్తి చేస్తానని అనుకోలేదు. కానీ ఆ కల నిజం అయ్యింది. ఇప్పుడు నన్ను మీరు డాక్టర్ అనసూయ సీతక్క పీహెచ్‌డీ అని పిలవొచ్చు అని చెప్పారు.

సీతక్క ఇక డాక్టర్ సీతక్క.. కల నెరవేర్చుకున్న ఎమ్మెల్యే
X

కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్కకు ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. చిన్నతనంలోనే ఉద్యమం పల్ల ఆకర్షితురాలై నక్సలైటుగా మారిన సీతక్క.. ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. అప్పటి నుంచి ఆదివాసీ ఆడబిడ్డ అయిన సీతక్క.. ప్రజల్లో మనిషిలా కలిసిపోయారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆదివాసీ బిడ్డలు పడుతున్న అవస్థలు చూసి స్వయంగా వారికి సాయం అందించారు. కొండలు, గుట్టలు ఎక్కుతూ మారుమూల ఆదివాసీ గ్రామాలకు వెళ్లి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఇన్నాళ్లూ ఎమ్మెల్యే సీతక్కగా ఉన్న ఆమె.. ఇకపై డాక్టర్ సీతక్కగా మారినట్లు తెలిపారు. తాను ఓయూ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందానని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. గొట్టికోయల తెగకు సంబంధించి ఆమె కేస్ స్టడీ చేశారు. దానికి సంబంధించిన పూర్తి థీసీస్ సబ్మిట్ చేయడంతో పాటు.. తాజాగా నిర్వహించిన వైవాలో కూడా అధ్యాపకులను ఇంప్రెస్ చేశారు. సీతక్క చేసిన 'సోషల్ ఎక్స్‌క్లూషన్ అండ్ డిప్రివేషన్ ఆఫ్ మైగ్రాంట్ ట్రైబల్స్ ఆఫ్ మైగ్రాంట్ ట్రైబల్స్ ఆఫ్ ఎర్స్ట్‌వైల్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ' థీసీస్‌కు ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీతక్క చాలా సంతోషంగా తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

నా చిన్నతనంలో నేనెప్పుడూ నక్సలైట్ అవుతానని అనుకోలేదు. నక్సలైట్‌గా ఉన్నప్పుడు లాయర్ అవుతానని.. లాయర్ అయ్యాక ఎమ్మెల్యే అవుతానని అనుకోలేదు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటూ పీహెచ్‌డీ పూర్తి చేస్తానని అనుకోలేదు. కానీ ఆ కల నిజం అయ్యింది. ఇప్పుడు నన్ను మీరు డాక్టర్ అనసూయ సీతక్క పీహెచ్‌డీ అని పిలవొచ్చు అని చెప్పారు. ప్రజలకు సేవ చేయడం మరియు జ్ఞానాన్ని పొందడం నా అలవాటు. నా చివరి శ్వాస వరకు దీన్ని నేను ఎప్పటికీ ఆపను అని అన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ టి. తిరుపతిరావు నా పీహెచ్‌డీ గైడ్‌గా ఉన్నారు. ఆయనతో పాటు ఈ థీసీస్ పూర్తి చేయడంలో సహాయం చేసిన ప్రస్తుత మణిపూర్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్, హెచ్‌ఓడీ ప్రొఫెసర్ ముసలయ్య, ప్రొఫెసర్ అశోక్ నాయుడు, ప్రొఫెసర్ చందూనాయక్‌లకు తన కృతజ్ఞతలు తెలిపారు.

First Published:  11 Oct 2022 9:10 AM GMT
Next Story