ప్రతిపక్షం మూసీని రాజకీయం చేస్తుంది : మంత్రి దామోదర
బీఆర్‌ఎస్ పార్టీ మూసీనీ రాజకీయం చేస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
BY Vamshi Kotas18 Oct 2024 8:52 PM IST

X
Vamshi Kotas Updated On: 18 Oct 2024 8:52 PM IST
బీఆర్‌ఎస్ పార్టీ మూసీనీ రాజకీయం చేస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మూసీనీ కాపాడుకునే చిత్తశుద్ధి, కమిట్మెంట్ ప్రభుత్వాలకు ఉండాలని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రకృతిని కాపాడుకోవాలని దామోదర పిలుపునిచ్చారు. 2016 లో మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు GO MS 7 అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.
మూసీ భాదిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు.. R&R ప్యాకేజ్ ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి చెప్పారు. మూసీ పక్కన జీవించే ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగదని ఆయన భరోసా కల్పించారు. పునరావాసం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి దామోదర తెలిపారు.
Next Story